తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహమ్మద్ సిరాజ్ 'స్పెషల్ గిఫ్ట్'

byసూర్య | Tue, Jul 09, 2024, 07:39 PM

టీ20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కలిశారు. మంగళవారం (జులై 09న) రోజు రేవంత్ రెడ్డి నివాసానికి విచ్చేసిన సిరాజ్.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సిరాజ్‌కు శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డికి సిరాజ్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. టీమిండియా జెర్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిరాజ్‌ బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌తో పాటు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత ముహమ్మద్ అజహరుద్దీన్‌ కూడా పాల్గొన్నారు.Latest News
 

ప్రమాద ఘంటికలు సూచిస్తున్న నీటి నిల్వలు Sun, Jul 14, 2024, 06:23 PM
రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ Sun, Jul 14, 2024, 03:56 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 03:11 PM
లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్ Sun, Jul 14, 2024, 03:10 PM
సీఎం రేవంత్ పై మండిపడ్డ కేటీఆర్ Sun, Jul 14, 2024, 02:20 PM