మేడ్చల్‌లో స్టోర్ ఓపెన్ చేసిన నేషనల్ స్టోర్

byసూర్య | Tue, Jul 09, 2024, 07:36 PM

హైదరాబాద్‌ నగరవాసులకు శుభవార్త. నగరంలో మరో అతిపెద్ద షాపింగ్ మాల్ ప్రారంభమైంది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ఇప్పటికే.. రకరకాల షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. గతంలో హైదరాబాద్ సెంట్రల్, ప్రసాద్స్ ఐమాక్స్, సిటీ సెంటర్ వంటి మాల్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు.. లూలూ మాల్ లాంటి ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్‌ కూడా మన నగరానికి వచ్చేశాయి. ఇక డీమార్ట్‌లు, రత్నదీప్‌, విశాల్ మార్ట్ లాంటి ఫ్యామిలీ షాపింగ్ మాల్స్ నగరంలో విరివిగా విస్తరించాయి. ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నప్పటికీ.. ఎప్పుడు చూసినా అన్నింట్లో జనాల రద్దీ ఉంటూనే ఉంటుంది.


హైదరాబాద్‌లో మాల్స్‌కి ఉన్న డిమాండ్‌, ఆదరణను అందిపుచ్చుకుంటున్న నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు.. తమ స్టోర్‌లను నగరంలో ఓపెన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. నగరంలో మరో అతిపెద్ద షాపింగ్ మాల్ ప్రారంభమైంది. నిత్యావసర వస్తువులు విక్రయించే "నేషనల్ మార్ట్ ఇండియా కా హైపర్ మార్ట్" మరో స్టోర్‌ తాజాగా ప్రారంభమైంది. తెలంగాణలో ఎనిమిదో స్టోర్‌గా.. జులై 06వ తేదీన ఈ మార్ట్‌ ప్రారంభమైంది. హైదరాబాద్ శివారులోని మేడ్చల్‌లో 40 వేల చదరపు అడుగుల్లో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్ట్‌లో.. కిరాణా, స్టేషనరీ, హోమ్, కిచెన్ అప్లయోన్సెన్, కుక్ వేర్, పాదరక్షలు, దుస్తులు వంటివన్నీ సరసమైన ధరలకు అందిస్తున్నట్టు.. నేషనల్ మార్ట్ ఫౌండర్ యశ్ అగర్వాల్ తెలిపారు.ఇందులో ప్రత్యేకంగా.. స్టైల్ మార్ట్ పేరుతో సొంత బ్రాండ్ దుస్తులను కూడా అమ్ముతున్నట్టు యశ్ పేర్కొన్నారు. అయితే.. నిత్యావసర వస్తువులు దగ్గరి నుంచి బ్రాండెడ్ దుస్తులు, పాదరక్షల వరకు అన్ని దొరకటం అది కూడా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే సరసమైన ధరల్లో దొరుకుతుండటం విశేషం.


అయితే.. ప్రజలు ప్రస్తుతం డీమార్ట్, విశాల్ మార్ట్‌లాంటి షాపింగ్ మాల్స్‌కి ఎక్కువగా అలవాటు పడటంతో.. వ్యాపారస్తులు అలాంటి షాపింగ్ మాల్స్‌‌ మాదిరిగానే.. భారీ స్థాయిలో ఓపెన్ చేయాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే.. పటాన్ చెరులో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పేరుతో అతిపెద్ద షాపింగ్ మాల్‌ను కూడా ప్రారంభించారు. కాగా.. ఇప్పుడు నేషనల్ మార్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో.. ఆయా ప్రాంతాల్లోని ప్రజల అవసరాలను తీర్చేందుకు.. ఆ షాపింగ్ మాల్స్ సౌకర్యవంతంగా మారనున్నాయి.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM