byసూర్య | Tue, Jul 09, 2024, 04:29 PM
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో రోడ్డు ప్రమాదం కాగా ఒకరికి గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొండ కిష్టస్వామిగౌడ్ తన బైకుపై బస్టాండ్లో యూటర్న్ తీసుకుంటుండగా.. ఎదురుగా బుగ్గ రాజేశ్వర తండాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి పల్సర్ బైక్ తో కిష్టస్వామి గౌడ్ని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన కిష్ట స్వామి గౌడ్ను ఎల్లారెడ్డిపేటలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.