మహిళలతో న్యూడ్ కాల్స్.. .. చైనా గ్యాంగ్ అరాచకాలు బయటపెట్టిన తెలంగాణ యువకుడు

byసూర్య | Tue, Jul 09, 2024, 07:27 PM

ఉద్యోగాల పేరుతో మోసం చేసి.. భారతీయ మహిళలను కంబోడియాకు అక్రమంగా తరలించి వారితో న్యూడ్ కాల్స్ చేయిస్తూ.. అతిపెద్ద సైబర్ క్రైం చేస్తున్న చైనీస్ ముఠా గుట్టును తెలంగాణకు చెందిన ఓ యువకుడు రట్టు చేశారు. ఆ చైనా గ్యాంగ్ చేతిలో బందీగా మారిన తెలంగాణ యువకుడు.. తన చేత నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లతో సైబర్ క్రైం చేపించిన విషయాన్ని బయటపెట్టాడు. కేవలం తనతో చేపించిన పనే కాకుండా.. ఆ చైనీస్ గ్యాంగ్ చేస్తున్న భయానక నేరాలను సాహసోపేతంగా బయటపెట్టాడు. తాను ఎలా ఈ గ్యాంగ్ చేతిలో చిక్కాడన్నది.. ఎలా బయటపడ్డాడన్నది.. వాళ్లు ఎలాంటి పనులు చేపిస్తున్నారన్నది.. క్షుణ్ణంగా వివరించాడు.తెలంగాణకు చెందిన మున్షీ ప్రకాష్‌ అనే యువకుడు.. సివిల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే.. విదేశాల్లో ఉద్యోగం కోసం పలు జాబ్ సైట్‌లలో తన ప్రొఫైల్‌ను పోస్ట్ చేశాడు. దీంతో.. మహబూబాబాద్‌లోని బయ్యారం మండలానికి చెందిన విజయ్‌ అనే వ్యక్తి తనకు ఫోన్‌ చేసి ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికినట్టు తెలిపాడు. అయితే.. ఆస్ట్రేలియా వెళ్లేముందు ట్రావెల్‌ హిస్టరీ కావాలని చెప్పి మలేషియాకు టిక్కెట్లు ఇప్పిస్తున్నట్టు చెప్పినట్టు తెలిపాడు.


కౌలాలంపూర్ నుంచి తనను మార్చి 12న నమ్‌పెన్‌కి తీసుకెళ్లారు. విజయ్‌ తన నుంచి 85 వేల విలువైన యూఎస్ డాలర్లను తీసుకున్నట్టు తెలిపాడు. ఆ తర్వాత.. చైనాకు చెందిన కొందరు వ్యక్తులు తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, తనను క్రోంగ్ బావెట్‌కు తీసుకెళ్లినట్టు వివరించాడు. అది టవర్లతో కూడిన పెద్ద కాంపౌండ్‌ అని.. అక్కడ తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన ఇండియన్‌లు చాలా మంది ఉన్నట్టు తెలిపాడు. అమ్మాయిల నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను రూపొందించేందుకు, వాటిని అమాయకులపై ప్రయోగించేందుకు తమకు పది రోజుల శిక్షణ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు.


ఆ పని నేను చేయనంన్నందుకు.. తనను వారం రోజుల పాటు చీకటి గదిలో ఉంచి చిత్రహింసలు పెట్టారని.. తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటున్న సమయంలో నన్ను బయటకు తీసుకొచ్చారని తెలిపారు. కానీ.. బయటకు వచ్చాక కూడా సైబర్ క్రైంను కొనసాగించాలని ఒత్తిడి చేశారు. మనసు చంపుకుని ఆ పని చేయలేక.. తాను అనుభవిస్తున్న నరకాన్ని, ఆ గ్యాంగ్ చేస్తున్న సైబర్ క్రైంను వివరిస్తూ రహస్యంగా సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసినట్టు తెలిపాడు. ఈ వీడియోనూ తమిళనాడులోని తన సోదరికి మెయిల్ పంపటంతో పాటు.. అధికారులకు కూడా పంపించినట్టు తెలిపాడు.


తనను రక్షించాల్సిందిగా.. అక్కడి భారత రాయబార కార్యాలయంతో పాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాడు. అయితే.. ప్రకాష్‌ని అంతకుముందు ఏప్రిల్ 16న కంబోడియా పోలీసులు ట్రాఫికర్ల నుంచి రక్షించారు. కానీ నకిలీ అభియోగంపై చైనీస్ ముఠా అతనిపై దాడి చేసి మళ్లీ అదుపులోకి తీసుకుంది. 12 రోజులు జైలు జీవితం గడిపాడు. ఆ ఛార్జీ నకిలీదని అధికారులు గుర్తించడంతో జూలై 5న తనను ఢిల్లీకి పంపించారని ప్రకాశ్‌ తెలిపాడు. అతనితో పాటు మరో తొమ్మిది మందిని రక్షించినట్టు తెలిపారు.


అయిత.. సుమారు 3,000 మంది భారతీయులు కంబోడియాలోని ఈ చైనా గ్యాంగ్ చేతిలో చిక్కుకున్నట్టు ప్రకాశ్ తెలిపాడు. వారిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పుకొచ్చారు. వీళ్లంతా.. తమను నిర్బంధించిన శిబిరాల నుంచి నగ్న కాల్స్ చేయవలసి ఉంటుదని తెలిపారు. అయితే.. కేరళ, తమిళనాడు, కర్నాటక, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల ప్రజలను తాను కలిశానని.. వాళ్లందరినీ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారని చెప్పినట్టు వివరించాడు.


ఈ సైబర్ క్రైం నుంచి సంపాదించే డబ్బు మొదట క్రిప్టోకరెన్సీగా.. ఆ తరువాత యూఎస్ డాలర్లుగా మార్చుతారని.. చివరకు చైనీస్ యువాన్‌గా మార్చుతారని ప్రకాశ్ వివరించాడు. ప్రకాశ్ వెల్లడించిన వివరాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఆ చైనా గ్యాంగ్ నుంచి భారతీయ మహిళలను కాపాడి.. సురక్షితంగా ఇంటికి పంపించేలా చర్యలు మొదలుపెట్టారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM