![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 04:21 PM
కాసుల బాలరాజ్ కు తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామక పత్రాలను అందజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం కోటగిరి మండల కేంద్రంలో కాసుల బాలరాజ్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు సంతోషంతో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కాపాడుకున్న ఘనత కాసులకే చెందుతుందని కోటగిరి తాజా మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ అన్నారు.