![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 03:49 PM
నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ, మండల కేంద్రంలోని గోదల్ రోడ్డు వైపు గల ప్రభుత్వ భూమిలో గతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని వాటిలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లాల్ అహ్మద్, ఆంజనేయులు, మధు, బాలీశ్వరయ్య పాల్గొన్నారు.