![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 03:40 PM
కోదాడలో 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ పెద్ద చెరువు కట్టను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలో రాష్ట్ర మంత్రులతో శంకుస్థాపన చేయించి పనులు ప్రారంభిస్తామన్నారు. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంతో కోదాడ ప్రజల కల సాకారం కానున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.