byసూర్య | Mon, Jul 08, 2024, 03:38 PM
రైతులకు రుణ పరిమితి పెంచాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆచరణలో లీడ్ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రఘుకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయరాజ్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున రైతులకు రుణాలు రాక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వెంటనే మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, రాజయ్య, భూషణం పాల్గొన్నారు.