byసూర్య | Wed, Jun 26, 2024, 02:31 PM
వనపర్తి జిల్లాలో ఫ్లెక్సీలు పెట్టిన వారి నుంచి రుసుము వసూలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. స్వపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఫ్లెక్సీకి రుసుము విధించాలన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ. వారి ప్రోగ్రాం అయిన మరుసటి రోజు ఫ్లెక్సీ తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.