byసూర్య | Wed, Jun 26, 2024, 02:29 PM
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ లో మంగళవారం రాత్రి ఏసీబీ డిఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేసి 50వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై రవికుమార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కల్వకుర్తికి చెందిన ఓ వ్యక్తి వద్ద మందు గుండు సామాగ్రి దొరికిన కేసులో లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏకకాలంలో దాడులు నిర్వహించి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.