byసూర్య | Wed, Jun 26, 2024, 02:26 PM
మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. మంగళవారం జిల్లా మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించిన మహిళా శక్తి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళుతుందని అన్నారు.