వాతావరణ శాఖ అప్డేట్.. మరో మూడు రోజుల పాటు వర్షాలు

byసూర్య | Sun, Jun 23, 2024, 09:41 PM

తెలంగాణ వాసులకు వాతవరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో తొలకరి జల్లులు ప్రారంభమగా.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మరో మూడు రోజుల పాటు.. వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది వాతావరణ కేంద్రం.


ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడా.. మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.


సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, భువనగిరి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


మరోవైపు.. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది.


ఇదిలా ఉండగా.. ఆదివారం రోజున హైదరాబాద్‌లో భారీ వర్షం కురియగా.. మంచిర్యాల, ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాసిపేటలో 6 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM