ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు

byసూర్య | Sun, Oct 27, 2024, 04:38 PM

హైదరాబాద్ నుంచి యాదాద్రి, వరంగల్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా ఉప్పల్ సమీపంలో ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ (ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్) నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7 కిలోమీటర్లు ఫ్లైఓవర్‌ నిర్మించాల్సి ఉంది. 2018లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా.. నిర్మించిన పిల్లర్లు సంవత్సరాలుగా అలంకారప్రాయంగా మారాయి. ఈ కారిడార్‌ను రూ.600 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ టెండర్లు ఆహ్వానించినా పనులు మందుకు సాగటం లేదు.


అంతకు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబరు చివరి నాటికి ఒక స్లాబ్‌ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్, ఎస్‌ఈ ధర్మారెడ్డిలకు ఆదేశాలు జారీ చేశారు. చాలా ఏళ్లుగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. అంసపూర్తి పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వీలైనంత తర్వగా ప్రాజెక్టు పనులు పూర్తిచేసి వానహదారులకు అందుబాటులోకీ తీసుకురావాలన్నారు.


ఇక ఫారెస్ట్ ఏరియాల్లో రోడ్ల నిర్మాణ పనులకు అటవీ శాఖ పర్మిషన్ల జారీ ఆలస్యం కావటంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో గత ఐదేళ్లుగా 7, నాలుగేళ్లుగా 1, మూడేళ్లుగా 20, ఏడాదిగా 31 ప్రాజెక్టులకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇది సరైంది కాదని అన్నారు. అటవీ అనుమతుల సాధనను పర్యవేక్షించేందుకు ఎస్‌ఈ స్థాయి అధికారిని స్పెషల్‌గా అపాయింట్ చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణలో మరిన్ని జాతీయ రహదారులు మంజూరు కావాలంటే ప్రస్తుతం ఉన్న రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓక రహదారుల నిర్మాణానికి డీఎఫ్‌వో స్థాయిలో 11 ఫైల్స్ పెండింగ్‌లో ఉండడంపై మంత్రి కొండా సురేఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఫైల్స్ క్లియరెన్స్ఎ‌లో ఆలస్యం కాకుండా ఫాస్ట్‌ ట్రాక్‌ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM