జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్

byసూర్య | Sun, Oct 27, 2024, 04:39 PM

రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ రెవెన్యూ గ్రామ శివారులో గల ఓ ఫాంహౌస్‌లో శనివారం అర్ధరాత్రి నిర్వహించిన మందు పార్టీ కలకలం రేపుతోంది. ఎటువంటి అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న ఎక్సైజ్, నార్సింగి, ఎస్వీటీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఓ ప్రముఖ వ్యక్తికి చెందిన ఫాంహౌస్‌లో జరగుతున్న పార్టీని భగ్నం చేశారు. దాదాపు 30 ఎకరాల్లో ఈ ఫాంహౌస్ విస్తరించి ఉండగా.. పార్టీలో 35 మంది పాల్గొన్నట్లు తెలిసింది. అందులోనూ 14 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


ఈ పార్టీలో ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధరణ అయింది. పార్టీలో పాల్గొన్న అందరికీ టెస్టులు నిర్వహించగా.. ఓ వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసుల కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు గాను..ఫాంహౌస్ యజమానిపై కూడా కేసులు నమోదు చేశారు. భారీ శబ్దాలతో పార్టీ జరుగుతున్నట్లు డయల్ 100కు కాల్ రాగా.. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఫాంహౌస్‌లో తనిఖీలు చేపట్టగా.. భారీగా ఫారిన్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు.


10 లీటర్లకు పైగా అనుమతి లేని విదేశీ మద్యం లభించినట్లు తెలిసింది. భారీగా ఇండియన్ మేడ్ లిక్కర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక జూదం ఆడేందుకు అవసరమైన ప్లేయింగ్ కార్డ్స్, పోకర్, క్యాసినో వంటి వాటిని గుర్తించారు. ఫాంహౌస్‌లో దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఎక్సైజ్ పోలీసులు.. సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం.


ఇక ఈ ఘటనపై బీజేపీ ఎంపీ రఘనందన్ రావు స్పందించారు. కొందరు పెద్దలను తప్పించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. జన్వాడ ఫాంహౌస్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. విదేశీ మద్యం, కొకైన్ తెచ్చిన నగరంలో దందా చేస్తున్నారన్నారు. ఫాంహౌస్ సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM