byసూర్య | Sat, Jun 22, 2024, 03:38 PM
బాన్సువాడ మండలంలోని కోన బాన్సువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు యోగాసనాలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగ ద్వారానే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.