byసూర్య | Sat, Jun 22, 2024, 03:33 PM
ఓ పాన్ షాపు యజమాని బంధువు కత్తులతో దాడి చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. న్యూ టౌన్ పాన్ మహల్ వద్దకు వీరన్నపేటకు చెందిన నలుగురి వ్యక్తులు వచ్చి సిగరెట్లు అడిగారు. పాత బాకీ చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య గొడవకు దారి చేసింది. పక్కనే ఉన్న షాప్ యజమాని బంధువు సోఫియాబిన్ సయ్యద్ ఓ యువకుడిపై దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.