byసూర్య | Fri, Jun 21, 2024, 02:57 PM
ప్రజలు తినే ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆహార కల్తీ నియంత్రణ జిల్లా అధికారి స్వాతి హెచ్చరించారు. గురువారం హాలియాలోని ఫేమస్ బేకరీపై వచ్చిన ఫిర్యాదు మేరకు పుర కమిషనర్ మున్వర్ అలీతో కలిసి తనిఖీలు నిర్వహించారు. శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్ష కోసం ల్యాబ్ కు పంపారు. బేకరీ యజమానికి రూ. 1500 జరిమానా విధించి కొన్ని రోజులపాటు అమ్మకాలు జరపకుండా నోటీసులు అందజేశారు.