byసూర్య | Fri, Jun 21, 2024, 03:00 PM
ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దామరచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన దొడ్డా సురేశ్ యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూ పాల్వంచకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.