byసూర్య | Fri, Jun 21, 2024, 02:54 PM
కోదాడ పట్టణంలోని ఆరో వార్డు గోపిరెడ్డి నగర్ లో బాడిశ జస్వంత్ అనే బాలుడి పై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తండ్రి రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడు ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడని స్టడీ అవర్ అనంతరం ఇంటికి వస్తుండగా వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు.