కరెంటు పోయిందని చెప్తే డైరెక్ట్‌గా ఇంటికొచ్చేస్తున్నారు..? యువతి ట్వీట్‌పై కేటీఆర్ రియాక్షన్

byసూర్య | Tue, Jun 18, 2024, 09:19 PM

తెలంగాణలో పరిస్థితులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఓవైపు బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ కోసం కొనుగోలు చేసిన విద్యుత్‌ విషయంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ వేసి విచారణ జరిపిస్తుండగా.. మరోవైపు రాష్ట్రంలో కరెంట్ కోతలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. మొన్నటివరకు వేసవి కాలం కావటంతో.. విద్యుత్ వినియోగం ఎక్కువగా జరగటం వల్ల కరెంట్ కోతలు విధించారనుకుంటే.. వానలు ప్రారంభమయ్యాక కూడా కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయని జనాలు వాపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరెంట్ కోతలు ఎక్కువవుతుండటంతో.. జనాలు సోషల్ మీడియా వేదికగా సమస్యలు తెలియజేస్తున్నారు.


ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి కరెంట్ కోతలపై ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. పవర్ కట్ అయ్యిందని అధికారులకు ఫిర్యాదు చేస్తే.. ఇంటికొచ్చి మరీ ట్వీట్ డిలీట్ చేపిస్తున్నారని చెప్పుకొచ్చింది. పైనుంచి ఒత్తిడి ఉందని చెప్తూ.. తాను పెట్టిన ట్వీట్ డిలీట్ చేపించారని తెలుపుతూ.. ఇదేం ప్రభుత్వమంటూ ప్రశ్నించింది. కాగా.. ఆ యువతి పెట్టిన పోస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.


"ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు ప్రాథమిక సమస్యలను పరిష్కరించలేని అవివేకులు భయపడుతున్నారు. మెరుగైన సేవలను కోరుతూ తమ గొంతు వినిపిస్తున్న జనాలను వేధించడం, బెదిరించడం పట్ల టీజీఎస్పీడీసీఎల్ సిగ్గుపడాలి. వాళ్లు చెప్పిన 'మార్పు' ఇదేనా?".. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. "నువ్వేం బాధపడకు.. నీతో మేం ఉన్నాం" అంటూ ధైర్యం చెప్పారు.


మరోవైపు.. యువతి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వంపై, కరెంట్ కోతలపై విమర్శలు గుప్పించగా.. మరికొంత మంది కరెంట్ కోతల విషయంలో తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. ఇంకొంత మంది నెటిజన్లు మీమ్స్ కూడా చేస్తున్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM