రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్.. ఇందిరమ్మ ఇండ్లు వాళ్లకు మాత్రమే ఇస్తారట

byసూర్య | Tue, Jun 18, 2024, 08:19 PM

సంచలన నిర్ణయాలతో పాలనలో తన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీల అమలులోనూ అదే మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలోనూ.. ప్రత్యేకత కనబరచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓ పథకం విషయంలో ప్రజలకు బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా ముఖ్యమైనది. పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే.. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల ఇచ్చి పేదప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.


ఈ క్రమంలోనే మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి మొదటి విడతగా.. ఇంటి స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇల్లు నిర్మాణం నిమిత్తం 5 లక్షల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పథకం ఆరంభంలోనే ఇంటి నమూనా కూడా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటీ.. ఎవరెవరికి మంజూరు చేస్తారన్న గైడ్‌లైన్స్ కూడా రిలీజ్ చేశారు.


అయితే.. ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇల్లు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. తొలి దశలో భాగంగా సొంత స్థలం ఉండి.. అందులో ఇల్లు లేనివారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందనుంది. లబ్ధిదారులు స్థానికంగా నివాసం ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది.


ఈ పథకానికి సంబంధించి మొత్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు మంజూరు చేస్తామని, ప్రతి నియోజక వర్గానికి 3500 ఇండ్ల ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటికి మరికొన్ని ఇండ్లు జోడించి లబ్ధిదారుల సంఖ్యను పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని సమాచారం. దీంతో.. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు.


ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి సర్కారు తాజాగా గుడ్ న్యూస్ వినిపించింది. ఇళ్ల నిర్మాణంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో.. మరో వార్త కూడా వినిపిస్తోంది. తొలి విడత ఇవ్వబోతున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం.. డ్రా పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పథకానికి సంబంధించి ఇతర రాష్ట్రాల అమలు తీరును పరిశిలీస్తున్న రేవంత్ సర్కార్.. చివరకు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.


ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 82.82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ప్రభుత్వం అనుకున్న దానికంటే దరఖాస్తులు చాలా ఎక్కువ సంఖ్యలో రావడంతో.. గతంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకానికి ఎలాగైతే లక్కీ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారో.. ఇప్పుడు కూడా అలాగే ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇలా అయితే.. పథకం అమలులో ఎలాంటి ఇబ్బంది రాదని.. ప్రజల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత రాదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందనేది.. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైతే గానీ తెలియదు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM