తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ ల బదిలీలు.. చందనా దీప్తికి కొత్త బాధ్యతలు

byసూర్య | Tue, Jun 18, 2024, 08:18 PM

తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే 20 మంది ఐఏఎస్ (IAS Transfers) అధికారులను బదిలీ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు.. తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల్లో పలువురిని డీజీపీ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. మరోవైపు.. నల్గొండ ఎస్పీగా ఉన్న చందనా దీప్తిని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ చేసింది ప్రభుత్వం.


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేపట్టగా... ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో బదిలీ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్నికలు ముగియటంతో.. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా భారీ ఎత్తున ఐపీఎస్లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది.


బదిలీ అయిన ఐపీఎస్‌ల వివరాలు..


హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌ హెగ్డే


హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్‌


సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి


ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా రుత్‌రాజ్‌


సీఐడీ ఎస్పీగా విశ్వజిత్‌ కంపాటి


సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్దన్‌


యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య


శంషాబాద్ డీసీపీగా బి. రాజేష్‌


మేడ్చల్‌ జోన్‌ డీసీపీగా ఎన్‌.కోటిరెడ్డి


వికారాబాద్‌ ఎస్పీగా కె.నారాయణరెడ్డి


జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్‌


సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్‌


జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు


కుమురంభీం అసిఫాబాద్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు


బాలానగర్‌ డీసీపీగా కె.సురేశ్‌ కుమార్‌


మహబూబ్‌నగర్‌ ఎస్పీగా జానకి ధరావత్‌


నల్గొండ ఎస్పీగా శరత్‌ చంద్రపవార్‌


వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా షేక్ సలీమా


డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని


మంచిర్యాల డీసీపీగా ఎ. భాస్కర్‌


జనగామ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా బి.మహేంద్ర నాయక్‌


టీజీఎస్పీ రెండో బెటాలియన్‌ (యాపలగూడ ఆదిలాబాద్‌) కమాండెంట్‌గా నితికా పంత్‌


Latest News
 

ఆగస్టులో ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ,,,మంత్రి పొంగులేటి Sun, Jul 21, 2024, 10:56 PM
ఆ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఈ పథకం వర్తింపు, వైద్య ఖర్చులకు 4 లక్షలు Sun, Jul 21, 2024, 10:08 PM
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన,,,,ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sun, Jul 21, 2024, 10:04 PM
కొత్త బస్సులు కొనుగోలు,,,ఆర్టీసీ బస్సుల్లో రద్దీకి చెక్,,మంత్రి పొన్నం Sun, Jul 21, 2024, 10:00 PM
భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. గోదావది ఉగ్రరూపం Sun, Jul 21, 2024, 09:48 PM