మహిళలకు గుడ్‌న్యూస్.. నెలనెలా ఖాతాల్లోకి రూ.2500, ప్రారంభం అప్పుడే.. వారికి మాత్రమేనటా

byసూర్య | Tue, Jun 18, 2024, 07:34 PM

తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సర్కారు.. ఈ క్రమంలోనే మహిళల అకౌంట్లలోకి నెలనెలా రూ. 2500 వేసేందుకు సిద్ధమవుతోంది. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన.. 18 ఏళ్లు నిండిన ఆడవాళ్లకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.


రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి మహిళకు.. నెలనెలా రూ. 2500 చొప్పున గౌరవ భృతి అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అయితే.. ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమయ్యాయిని.. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ హామీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఖాతాల్లో నెలనెలా రూ.2500 జమకానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


మహిళలకు ఆర్థిక సాయం విషయంలో తమ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అయితే సర్కారు నుంచి ఎటువంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలనెలా ఈ 2500 రూపాయలు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఈ పథకాన్ని జులై నుంచి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM