![]() |
![]() |
byసూర్య | Tue, Jun 18, 2024, 01:51 PM
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో విద్యుత్ ఉపకేంద్రం ఎదుట రోడ్డును ఆనుకుని ఉన్న చిరు దుకాణాలు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ఈ రోడ్డుపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని దుకాణాలను తొలగించాలని కోరుతున్నారు. కాగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో ఖాళీ చేయిస్తామని మంగళవారం విద్యుత్ అధికారులు తెలిపారు.