![]() |
![]() |
byసూర్య | Tue, Jun 18, 2024, 01:47 PM
సాగర్ జలాశయంలో నీటి మట్టం తగ్గుతుండటంతో ఇటు రైతులు, అటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం అందిన సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 504. 50 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం, 312. 00 టీఎంసీలకు 122. 5225 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది. ఇక నందికొండ ప్రజలకు తాగునీటికి కూడా అడపాదడప ఆటంకం కలుగుతుంది.