![]() |
![]() |
byసూర్య | Tue, Jun 18, 2024, 01:45 PM
మునగాల మండలం కృష్ణానగర్ లో విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన భూక్య శంకర్, గుగులోతు వెంకటేశ్వర్లు లకు చెందిన నాలుగు పాడి గేదెలు సోమవారం మృతి చెందాయి. మేతకు వెళ్లిన గేదెల కు పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తగలడం వల్ల మృతి చెందినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. గేదెలు మృతి చెందడంతో తాము ఉపాధి కోల్పోయామని సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలని కోరారు.