byసూర్య | Sun, Jun 16, 2024, 08:15 PM
మహ్మదాబాద్ మండల పరిధిలో జంతుబలిని నివారించాలని బిజెపి మండల నాయకులు కుర్వ కృష్ణ ఎస్సైని కోరారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ ఎస్ఐకి జంతుబలిని నివారించాలని వినతి పత్రం సమర్పించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ..గోవధ నిషేధం అమలులో ఉన్నందున మండల పరిధిలోని గ్రామాల్లో ఎక్కడైనా సరే ఆవులను, జంతువులను ముస్లింలు కోస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఐని ఆయన కోరారు.