![]() |
![]() |
byసూర్య | Sun, Jun 16, 2024, 08:10 PM
రాళ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అల్లిపూర్-కురుమూర్తి గ్రామాల మధ్య జరిగింది. స్థానికుల కథనం మేరకు రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా ముందున్న వాహనాన్ని అధిగమించేందుకు ప్రయత్నించి అదుపుతప్పి ట్రాలీ బోల్తా పడింది. ఈ క్రమంలో డ్రైవర్ పక్కకు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.