byసూర్య | Sat, Jun 15, 2024, 03:37 PM
బాల్కొండ మండల కేంద్రానికి సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై HP పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగి ఉన్న లారీని మరో ఐచర్ వాహనం ఢీ కొట్టిందని చెప్పారు. దీంతో స్టీరింగ్ ముందు భాగంలో లారీ డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఈ సంఘటనలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.