byసూర్య | Sat, Jun 15, 2024, 03:35 PM
ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటన కొమురం భీం జిల్లా కెరమెరి ఘాట్ వద్ద చోటుచేసుకుంది. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్లే ఘాట్ రోడ్డుపై శనివారం ఎదురెదురుగా వస్తున్న కారు, బస్సు ఢీకొన్నాయి. ఘాట్ రోడ్డు పక్కన లోయ ఉండటంతో బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. కాగా కొద్దిసేపు ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.