byసూర్య | Sat, Jun 15, 2024, 03:39 PM
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా 11వ వార్డ్ కౌన్సిలర్ కాసర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 సం. లు పూర్తయిన పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని తల్లులకు బీసీ స్కూల్ టీచర్స్ లక్ష్మి, పద్మ, పద్మావతి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఉమారాణి వైద్య, ఆయా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.