byసూర్య | Sat, Jun 15, 2024, 03:41 PM
జిల్లా కేంద్రంలోని శాంతి టాకీస్ రోడ్డులో ఓ కిరాణా దుకాణంలో గుట్కా నిల్వలు ఉంచినట్లు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 1, 14, 216 విలువైన 18 రకాల 519 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో కొమిరిశెట్టి ప్రసాద్, సంతోష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి నాగేశ్వరరావు తెలిపారు.