byసూర్య | Sat, Jun 15, 2024, 03:02 PM
పేద మధ్యతరగతి వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచితవిద్యను సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. శనివారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బకల్వాడి పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దుస్తులు పంపిణి చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తుందని పేర్కొన్నారు.