byసూర్య | Sat, Jun 15, 2024, 02:59 PM
చింతపల్లి మండలం కొక్కిరాల తండా వద్ద శనివారం దేవరకొండ ఆర్టీసీ డిపో రిక్వెస్ట్ బస్ స్టాప్ ను ఏర్పాటు చేసింది. సాగర్ హైదరాబాద్ రహదారి పక్కన ఉన్న ఈ తండా వాసులు ఎక్కువ సంఖ్యలో హైదరాబాదుకు రాకపోకలు జరుపుతుంటారు. స్థానికులు బస్ స్టాప్ గురించి ఎమ్మెల్యే బాలు నాయక్ ను కలవగా, ఎమ్మెల్యే సూచన మేరకు ఆర్టీసీవారు బస్ స్టాప్ ఏర్పాటు చేశారు. కాగా రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.