ఆర్టీసీ బస్సు ఆపి, డ్రైవర్‌పై చెప్పుతో దాడి.. యువకుల తిక్క కుదిర్చిన ప్రయాణికులు

byసూర్య | Wed, May 29, 2024, 09:42 PM

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజూ ఏదో రకంగా ఆర్టీసీ వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా.. మహిళ ప్రయాణికుల సంఖ్య పెరగటంతో పాటు గొడవల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. గతంలో ఆర్టీసీ సిబ్బందిపై ఎప్పుడైనా వేగంగా వెళ్తూ.. మిగతా వారికి ఇబ్బంది కలిగించినప్పుడో, లేదా ఏదైనా యాక్సిడెంట్ చేసినప్పుడో.. ఇంకేదైనా తప్పు చేసినప్పుడో మాత్రమే.. కోపంతో వారిపై దాడి చేసేవాళ్లు. కానీ.. ఈ ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి కారణం ఉన్నా లేకపోయినా.. చిన్నదానికి పెద్దదానికి.. చేతులు లేపుతున్నారు. కొంతరైతే చెప్పులు కూడా లేపుతున్నారు. అచ్చం అదే ఓవరాక్షన్ చేసి.. ఆర్టీసీ బస్సును రోడ్డుపై ఆపి మరీ.. డ్రైవర్ మీద చెప్పుతో దాడి చేశారు ఇద్దరు యువకులు. ఆ తర్వాత.. ఆ బస్సులోని ప్రయాణికులంతా కలిసి ఆ యువకుని తిక్క కుదిర్చారు.


కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఆపిన గాలిపల్లి అనిల్ అనే యువకుడు, అతని స్నేహితునితో కలిసి.. డ్రైవర్‌పై చెప్పుతో దాడి చేశాడు. అసలెందుకు దాడి చేస్తున్నారో డ్రైవర్‌కు కూడా అర్థం కాలేదు కానీ.. హీరో లెవల్‌లో బస్సు ఇంజన్ మీద ఎక్కి గట్టి గట్టిగా అరుస్తూ.. డ్రైవర్‌ మీద దాడి చేశారు. రోడ్డుపై వెళ్లేప్పుడు అతని బండికి సైడ్ ఇవ్వలేదో, లేదా కొంచెం వేగంగా వెళ్లాడో.. అతనికి ఎందుకు కోపం వచ్చిందో కానీ.. సినిమాల్లో చూపించినట్టు.. ఓవర్ టెక్ చేసి బస్సును ఆపి మరీ దాడి చేశాడు.


ప్రయాణికులు ఎంత సముదాయించినా.. బెదిరించినా ఆ యువకుడు మాత్రం తగ్గలేదు. దీంతో.. అతని తిక్క కుదుర్చాలని నిర్ణయించుకున్న ప్రయాణికులు.. ఆ యువకున్ని బంధించి.. బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. జరిగిన దాడి గురించి పోలీసులు చెప్పారు. దీంతో.. ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ చర్యతో.. ఆ యువకునికి తిక్క కుదిర్చినట్టయింది.


Latest News
 

ఎంపీని సత్కరించిన మహమ్మద్ నగర్ కాంగ్రెస్ నాయకులు Tue, Jun 18, 2024, 03:33 PM
మెయిన్ రోడ్డుపై గుంతలను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ Tue, Jun 18, 2024, 03:31 PM
ఫిర్యాదుదారునిపై హత్యాయత్నం చేసిన నిందితులు Tue, Jun 18, 2024, 03:30 PM
కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..? Tue, Jun 18, 2024, 03:27 PM
నీటి పంపింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే Tue, Jun 18, 2024, 03:26 PM