కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించలేదు: కవిత లాయర్ మోహిత్ రావు

byసూర్య | Tue, May 28, 2024, 11:13 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈడీ అధికారులు చేసిన వాదనలపై వస్తున్న అవాస్తవాలను.. కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ వాదనలు చేసిందని.. అయితే అందులో ఎక్కడా కేసీఆర్ పేరు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు గురించి మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కల్వకుంట్ల కవిత ముందే చెప్పారని.. తన టీం సభ్యులను ఢిల్లీలోని ఆమె నివాసంలో కేసీఆర్‌కు పరిచయం చేశారని.. వస్తున్న వార్తలన్నీ అసత్యాలని మోహిత్ రావు తేల్చి చెప్పారు.


అసలు కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈడీ చేసిన వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన జరగలేదని తేల్చి చెప్పారు. ఈ కేసులో అఫ్రూవర్‌గా మారిన మాగుంట రాఘవ రెడ్డి గురించి, ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి ఢిల్లీ హైకోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించారని వెల్లడించారు. అయితే ఈడీ అధికారులు వాదనల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ప్రస్తావించగా.. అది కేసీఆర్‌కు అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని తెలిపారు. మాగుంట రాఘవ రెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనలను కల్వకుంట్ల కవిత తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మీడియా తప్పుగా అన్వయించిందని మోహిత్ రావు పేర్కొన్నారు.


ఇక ఎక్కడా కూడా కేసీఆర్ పేరును రాయలేదని స్పష్టం చేశారు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఈడీ అధికారులు మాగుంట రాఘవ రెడ్డి వాంగ్మూలాన్ని ప్రస్తావించారని తెలిపారు. ఈ సందర్భంగానే సంబంధిత వాంగ్మూల పత్రాన్ని కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ మోహిత్ రావు బహిర్గతం చేశారు. మాగుంట రాఘవ రెడ్డి.. తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న మిగిలిన సభ్యులను పరిచయం చేశానని చెప్పినట్లు ఉందని ఈడీ తెలిపారు. కానీ కొందరు కావాలని కవితపై, కేసీఆర్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. అందులో భాగంగానే ఈ వార్తలు వస్తున్నాయని చెప్పారు.


ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. అయితే ఢిల్లీ మద్యం విధానం గురించి.. ముందే కేసీఆర్‌కు కవిత చెప్పారనే వార్తలు ఇవాళ గుప్పుమన్నాయి.


Latest News
 

పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని మెస్సేజ్.. ఓపెస్ చేస్తే రూ.2 లక్షలు కట్.. మీరూ ఇలా చేయకండి. Tue, Jan 14, 2025, 09:55 PM
గాలిపటం ఎగరేసేందుకు గుట్టపైకి పిల్లలు.. పొదల మాటున కనిపించిన సీన్ చూసి షాక్ Tue, Jan 14, 2025, 09:03 PM
కల్వకుంట్ల కవిత ఇంట్లో స్పెషల్ సంక్రాంతి.. వెల్లివిరిసిన సంతోషం Tue, Jan 14, 2025, 08:57 PM
చోరీ చేసి పారిపోతూ ఫ్లైఓవర్ నుంచి దూకేశాడు Tue, Jan 14, 2025, 08:50 PM
ఆ మంత్రికి వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదు.. బీజేపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Tue, Jan 14, 2025, 08:46 PM