రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. ఈ ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు, నిర్మాణంపై కీలక అప్టేట్

byసూర్య | Tue, May 28, 2024, 08:49 PM

తెలంగాణ దశ దిశను మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసింది. రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే తెలంగాణ పట్టణ రాష్ట్రంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్‌ ఔటర్ రింగు రోడ్డు (ORR)కు సుమారు 40 కి.మీ దూరం నుంచి ఉత్తర, దక్షిణ భాగాలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం నుంచి నిర్మాణ అనుమతులు వచ్చాయి. జాతీయ రహదారి నెంబర్ కూడా కేటాయించారు.


ఇక ఈ రెండు భాగాల అనుసంధాన ప్రాంతా(ఇంటర్‌ఛేంజ్‌)లను వినూత్నంగా నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ (NHAI) డిసైడ్ అయింది. అందుకోసం రహదారి ప్రణాళికలో మార్పులు సైతం చేసింది. తాజా మార్పుతో ప్రాజెక్టు నిర్మాణానికి మరింత భూమి సేకరించాల్సి వస్తుందని అధికారులు అంచనాలు రూపొందించారు. 158.65 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఉత్తర భాగం రహదారికి కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులు కేటాయిస్తారు. ఈలోగా నిర్మాణం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులు పూర్తి చేయాలని అధికారులు కార్యచరణ రూపొందిస్తున్నారు.


రీజినల్ రింగు రోడ్డు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో నిర్మాణ కసరత్తుకు సంబంధించిన పనులు కొంతమేర ఆలస్యమయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం తమకు ప్రాధాన్య అంశమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణం కోసం తొలుత 1,879.05 హెక్టార్ల మేరకు భూసేకరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.


సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల మీదుగా ఉత్తర భాగం మార్గాన్ని నిర్మించనున్నారు. ఉత్తర-దక్షిణ భాగాలు అనుసంధానం అయ్యే ప్రాంతాల్లో వినూత్న రీతిలో జంక్షన్లు నిర్మించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌-విజయవాడ రహదారిలో భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఒక ఇంటర్ ఛేంజ్ రానుండగా.. హైదరాబాద్‌-ముంబయి మార్గంలో సంగారెడ్డి జిల్లాలో మరొక జంక్షన్‌ నిర్మించనున్నారు. ఉత్తర, దక్షిణ భాగాలను కలిపే ఈ జంక్షన్లను డంబెల్‌ ఆకారంలో నిర్మించనున్నారు. అయితే అందుకు అధిక భూసేకరణ అవసరమవుతుంది అధికారులు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే.. త్వరలోనే ప్రాంతీయ రింగు రోడ్డు కల సాకారం కానుంది. అప్పుడు తెలంగాణ మరింత వేగంగా అభివృద్ది చెందటం ఖాయం


Latest News
 

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే Mon, Dec 02, 2024, 01:04 PM
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి Mon, Dec 02, 2024, 01:01 PM
ఏడాది పాలనలో ఏం చేశారని విజయోత్సవాలు : డీకే అరుణ Mon, Dec 02, 2024, 12:26 PM
స్వల్పంగా తగ్గిన పత్తి, మిర్చి ధరలు Mon, Dec 02, 2024, 12:22 PM
వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య Mon, Dec 02, 2024, 12:10 PM