హైదరాబాద్-విజయవాడ‌ హైవే వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆ సమస్యకు చెక్, ఇక సేఫ్ జర్నీ

byసూర్య | Tue, May 28, 2024, 08:04 PM

హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-163) జాతీయ రహదారి ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం వేల సంఖ్యలో ఈ రహదారిపై వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఆ రహదారి గుండానే ఎక్కవ ప్రయాణాలు చేస్తారు. పండగ రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే ఈ రహదారిపై ప్రతి నిత్యం రోడ్డు ప్రమదాలు చోటు చేసుకుంటాయి. హైదరాబాద్ మెుదలుకొని విజయవాడ చేరుకునేలోపు.. రోజులో ఒకటి, రెండైనా యాక్సిడెంట్లు జరగుతూ ఉంటాయి.


మొత్తం మార్గంలో 17 చోట్ల బ్లాక్ స్పాట్‌లు ఉన్నాయని.. అక్కడే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో తక్షణమే ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు జాతీయ రహదారుల సంస్థ సిద్ధమైంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే పనులు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సహా పనుల బాధ్యతను ఓ ఏజెన్సీకి అప్పగించారు. చౌటుప్పల్‌ నుంచి నవాబ్‌పేట జంక్షన్‌ వరకు గుర్తించిన 17 బ్లాక్‌ స్పాట్లలో 10 చోట్ల అండర్‌ పాస్‌లను నిర్మించనున్నారు.


ప్రమాదాల నివారణ కోసం అండర్ పాసులు, రోడ్ల వెడల్పు, సైన్ బోర్డులు సహా పనుల నిర్వహణకు రూ.288 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. చౌటుప్పల్‌, పెద్దకాపర్తి, చిట్యాల, టేకుమట్ల, జనగామ క్రాస్‌, ఎస్వీ కాలేజ్‌, సూర్యాపేట ఫ్లై ఓవర్‌ ముగిసే చోట, ముకుందాపురం, కొమరబండ క్రాస్‌ రోడ్‌, రామాపురం క్రాస్‌ రోడ్‌ వద్ద అండర్‌పాసులు నిర్మించనున్నారు. కట్టంగూరు దగ్గర జంక్షన్‌ అభివృద్ధి, ఇనుపాముల దగ్గర ఉన్న సర్వీస్‌ రోడ్‌ విస్తరణ, ధూర్జపల్లి దగ్గర ఉన్న జంక్షన్‌ అభివృద్ధితో పాటు మరో రహదారి నిర్మాణం, ఆకుపాముల, నవాబ్‌పేట వెళ్లే మార్గాల దగ్గర జంక్షన్ల అభివృద్ధి, హైవే లైటింగ్‌తో పాటు సూచిక బోర్డుల ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభం కానుండగా.. ఈ రూట్లలో వెళ్లేవారి ప్రయాణం సాఫీగా జరగనుంది.


Latest News
 

అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్ Fri, Oct 18, 2024, 07:52 PM
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM