తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? అయితే మీకో అలర్ట్, ఇబ్బంది పడొద్దు

byసూర్య | Sun, May 26, 2024, 07:45 PM

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. గత 10 రోజుల నుంచి రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారం ఉదయం రద్దీ కాస్త తగ్గినా సాయంత్రానికి మళ్లీ పెరిగింది. టైంస్లాట్‌ టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు.


శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం శ్రీవారిని 70,668 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారికి రూ.3.64 కోట్ల హుండీ కానుకలు లభించాయి. నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్‌లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటివి అందిస్తున్నారు.


భక్తులు రద్దీని చూసుకుని తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని ఇక్కడకు వచ్చి ఇబ్బందులు పడొద్దని అధికారులు సూచిస్తున్నారు. భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్‌లలో వేచి ఉండాల్సి వస్తోందని వారంతా త్వరగా శ్రీవారిని దర్శించుకునే విధంగా.. జూన్ 30 వరకు ప్రతి శుక్ర శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.


Latest News
 

ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం Tue, Oct 22, 2024, 06:57 PM
కొండా సురేఖపై 100 కోట్లకు కేటీఆర్ పరువు నష్టం దావా.. 'వాళ్లందరికీ ఇదొక గుణపాఠం Tue, Oct 22, 2024, 06:53 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Tue, Oct 22, 2024, 06:48 PM
గ్రేటర్‌ వాసులకు బిగ్‌ అలర్ట్ Tue, Oct 22, 2024, 05:11 PM
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి Tue, Oct 22, 2024, 04:34 PM