యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు

byసూర్య | Tue, Oct 22, 2024, 06:48 PM

యూట్యూబ్ వీడియోలు చూసే చాలా మంది వీక్షకులకు హర్షసాయి సుపరిచితుడే. హీరో రేంజ్‌లో ఫ్యాన్ బేస్ ఉన్న హర్షసాయి ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు తన వీడియోల్లో జూదానికి సంబంధించిన ప్రమోషన్స్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారితే.. ఇప్పుడు తనపై బిగ్ బాస్ కార్యక్రమంతో వెలుగులోకి వచ్చిన ఓ నటి లైంగిక ఆరోపణలు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ నటి ఫిర్యాదు మేరకు.. సెప్టెంబర్ 24న పోలీసులు కేసు నమోదు చేయగా.. అప్పటి నుంచి హర్ష సాయి పరారీలోనే ఉండటం గమనార్హం. దీంతో.. పోలీసులు హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.


ఇదిలా ఉంటే.. తాజాగా హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చింది. ఈ కేసులో హర్షసాయి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆయన ఎలాంటి మోసానికి పాల్పడలేదంటూ.. తన క్లయింట్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషనర్ తరపు లాయర్.. ధర్మాసనాన్ని కోరారు.


కాగా.. హర్షసాయి పిటిషన్‌పై ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన బాధితురాలు.. తమవైపు వాదనలు కూడా వినాలని.. ఆ తర్వాతే బెయిల్ పిటిషన్ మీద విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. హర్షసాయి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.


అయితే.. బిగ్ బాస్ షో ద్వారా ఫేమ్‌లోకి వచ్చిన నటి, హర్షసాయి ఓ పార్టీలో కలిశారు. కాగా.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే.. పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పటంతో ఇద్దరు తమ మధ్య ఉన్న హద్దులను చెరిపేస్తూ ఏకంతంగా గడిపారు. కాగా.. హర్షసాయి తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టగా.. అందులో సదరు నటి హీరోయిన్‌గా నటిస్తుండటంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.


అయితే.. సినిమా కాపీరైట్స్ విషయంలో చెడటంతో.. ఇద్దరి మధ్య నడుస్తున్న వివాదాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలతో తనను బెదిరిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేయటంతో.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.



Latest News
 

హైదరాబాద్ లో పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు Tue, Oct 22, 2024, 08:46 PM
జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు టీపీసీసీ చీఫ్ వెల్లడి Tue, Oct 22, 2024, 08:45 PM
భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంతో హైకోర్టుకు చెన్నమనేని రమేశ్ Tue, Oct 22, 2024, 08:43 PM
రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్ Tue, Oct 22, 2024, 08:13 PM
సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి Tue, Oct 22, 2024, 07:50 PM