ఉపరితల ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్

byసూర్య | Sun, May 26, 2024, 07:50 PM

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాజస్థాన్‌ నుంచి రాష్ట్రం మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కి.మీ వేగంతో ఉత్తరదిశగా కదులుతున్నట్లు వెల్లడించారు.


దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం,వరంగల్, కరీంనగర్, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేశారు.


అదే సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు. నిర్మల్‌ జిల్లాలో శనివారం భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. కుభీర్‌ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ముజిగిలో 45.2 డిగ్రీలు, తానూరు మండల కేంద్రంలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. శనివారం కుమురం భీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.


Latest News
 

హైదరాబాద్ లో పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు Tue, Oct 22, 2024, 08:46 PM
జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు టీపీసీసీ చీఫ్ వెల్లడి Tue, Oct 22, 2024, 08:45 PM
భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంతో హైకోర్టుకు చెన్నమనేని రమేశ్ Tue, Oct 22, 2024, 08:43 PM
రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్ Tue, Oct 22, 2024, 08:13 PM
సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి Tue, Oct 22, 2024, 07:50 PM