కరీంనగర్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హనుమాన్ మాలధారుడిని లాక్కెళ్లిన పోలీస్ వెహికల్

byసూర్య | Sun, May 26, 2024, 07:34 PM

కరీంనగర్ పట్టణంలో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, హనుమాన్ మాలధారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ప్రజల్ని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఓ మాలధారుడిని పోలీసు వాహనం లాక్కెళ్లగా.. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గొడవకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పట్టణంలో హనుమాన్ మాలధారులు శనివారం ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల చౌరస్తా వద్దకు రాగానే.. ఓ వ్యక్తి తల్వార్‌తో వచ్చి దాన్ని తిప్పుతూ ర్యాలీకి అడ్డుపడ్డాడు. దీంతో హనుమాన్ మాలధారులు సదరు వ్యక్తితో వాగ్వాదానికి దిగారు.


 ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ర్యాలీని నిలిపివేయాలని హనుమాన్ భక్తులను కోరారు. దీంతో ఆగ్రహించిన హనుమాన్ మాలధారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. భక్తులు ఎంత చెప్పినా వినకపోవటం, పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. హనుమాన్ మాలలో ఉన్న భక్తులను దౌర్జన్యంగా ఎలా అరెస్ట్ చేస్తారని.. అక్కడే మాలధారులు పోలీస్ వాహనానికి అడ్డుపడ్డారు. అయినప్పటికీ పోలీసులు అలాగే ముందుకు వెళ్లారు.


ఓ హనుమాన్ మాలధారుడు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకోగా... లెక్కచేయకుండా పోలీసులు అతన్ని అలాగే లాక్కుంటూ అత్యంత వేంగగా తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరెస్ట్ అందుకున్న బీజేపీ నాయకులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అదుపులోకి తీసుకున్న హనుమాన్ భక్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ర్యాలీకి బ్రేక్ పడిన ప్రాంతంలో ఆందోళన చేశారు. అక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలు, నాయకులపై లాఠీఛార్జ్ చేశారు. వారిని వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.


ఈ ఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. భక్తులపై దాడి చేసినవారిని అరెస్ట్ చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న హనుమాన్ భక్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలన్నారు.


Latest News
 

మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం Tue, Oct 22, 2024, 10:55 AM
హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి Tue, Oct 22, 2024, 10:47 AM
నేడు హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం Tue, Oct 22, 2024, 10:26 AM
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM