పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి వైసీపీ ఎంపీ మద్దతు

byసూర్య | Sun, May 26, 2024, 07:12 PM

తెలంగాణలో ఎన్నికల జాతర నడుస్తోంది. మొన్నటివరకు లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగగా.. జూన్ 4వ తేదీన వాటి ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే.. రేపు (మే 27వ తేదీన) ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అదే స్థాయిలో ప్రచారం కూడా నిర్వహించాయి. కాగా.. తెలంగాణలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో.. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బరిలో దిగుతుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.


అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పలు సంఘాలు, పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలోనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా తన మద్దతు ప్రకటించారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తన మద్దతు ఇస్తున్నట్టు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. రాష్ట్రంలోని అన్న వర్గాల సమస్యలు, అవినీతిపై ప్రశ్నించే గుణం ఉన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న అని కృష్ణయ్య తెలిపారు. అలాంటి నాయకున్ని.. కులాలు, పార్టీలకు అతీతంగా గెలిపించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేబట్టిన వైఎస్ షర్మిల.. ఎన్నికల ప్రచారంలో తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వైసీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆర్ కృష్ణయ్య.. కాంగ్రెస్ అభ్యర్థికి తన మద్దతు తెలపటం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి.. కృష్ణయ్య చేసిన ప్రకటనపై వైసీపీ అధిష్ఠానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


కాగా.. ఆర్ కృష్ణయ్య ఫక్తు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావటంతో పాటు.. బీసీ సంక్షేమ సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బరిలో దిగటంతో.. ఆయనకు ఆర్ కృష్ణయ్య తన మద్దతు ప్రకటించారు.


Latest News
 

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. Mon, Oct 21, 2024, 04:32 PM
బుగ్గారం ఎక్స్ రోడ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన BRS నాయకులు Mon, Oct 21, 2024, 04:30 PM
పిఈటి జిల్లా టాపర్ అంకం శేఖర్ కు ఘనసన్మానం Mon, Oct 21, 2024, 04:24 PM
ప్రజలను మోసం చేయడమేనా కాంగ్రెస్ ప్రజా పాలన Mon, Oct 21, 2024, 04:22 PM
సిరి సంపదలు ఇచ్చే దైవం అయ్యప్ప స్వామి... ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.. Mon, Oct 21, 2024, 04:17 PM