శ్మశానం సమీపంలో ఫ్లాట్ కొన్న హైదరాబాదీ.. కామెంట్లతోనే భయపెట్టిస్తున్న నెటిజన్లు

byసూర్య | Sun, May 26, 2024, 07:09 PM

హైదరాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లంతా నగరంలోనే ఇండ్లు కొనుక్కుని స్థిరపడుతున్నారు. కొందరు నగర శివారుల్లో స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టించుకుంటే.. చాలా మంది మాత్రం ఆపార్ట్ మెంట్లలో ఫ్లాట్లు కొనేసుకుంటున్నారు. అలా ఓ ఫ్లాట్ కొనుక్కున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. తాను కొన్న ఫ్లాట్‌‌ పక్కనే శ్మశానం ఉన్నట్టు గమనించాడు. తన ఫ్లాట్ బాల్కనీ నుంచి చూస్తే.. నేరుగా శ్మశానమే కనిపిస్తుందని ఒకింత ఆందోళన వ్యక్తం చేశాడు. తన అనుభవాన్ని, అనుమానాన్ని రెడ్డిట్ వేదికగా పంచుకున్నాడు.


"నేను మియాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ను బుక్ చేశాను. బుకింగ్ చేయడానికి ముందు.. సైట్‌ను రెండు మూడు సార్లు సందర్శించాను. బాల్కనీ వ్యూతో పాటు అన్ని నాకు ఎంతగానో నచ్చాయి. కానీ ఇటీవల వెళ్లినప్పుడు.. నా ఫ్లాట్‌ నుంచి చూస్తే ఓ శ్మశానవాటిక కనిపించింది. ఇంతకుముందు వెళ్లినప్పుడు దాన్ని నేను గమనించలేదు. ఈ విషయం నన్ను కొంచెం టెన్షన్ పెడుతోంది. నేను దీని గురించి ఆందోళన చెందాలా..? ఇది భవిష్యత్తులో నా ఫ్లాట్ రీసేల్ విలువను ఎఫెక్ట్ చేస్తుందా?" అంటూ తన ఆందోళనతో పాటు అనుమానాన్ని వ్యక్తం చేశాడు.


అయితే.. ఆ వ్యక్తి పెట్టిన పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు విలువైన సలహాలు సూచనలు ఇస్తుంటే.. మరికొంత మంది మాత్రం.. ఇప్పటికే కొంత టెన్షన్‌లో ఉన్న ఆ వ్యక్తిని తమ కామెంట్లతో ఇంకాస్త భయపెడుతున్నారు. "గ్రేవ్ మిస్టేక్" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. "డోంట్ వర్రీ బ్రదర్.. మేము కూడా శ్మశానం పక్కన 3 సంవత్సరాలు నివసించాము. వాళ్లు పెద్దగా ఇబ్బంది పెట్టరు!" అంటూ సెటైర్ వేశారు.


ఒంటరితనానికి ఇది మంచి ప్లేస్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. "ఇది అంతగా భయడాల్సిన విషయమేమీ కాదు. మహా అయితే ఆత్మలు మీతో రోజుకు రెండుసార్లు మాట్లాడాలనుకుంటున్నాయి. ఒంటరితనంతో పోరాడటానికి ఇది చాలా మంచిది." అంటూ ఓ నెటిజన్ భయపెట్టే ప్రయత్నం చేశాడు. "నిజానికి మీకు ప్రశాంతమైన నైబర్స్ దొరికారు. నాకు ఇక్కడ సమస్యేమీ కనిపించట్లేదు." అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


"ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. వాళ్లు కొన్నిసార్లు తెల్లవారుజామున 3 గంటలకు మీ తలుపు తడతారు. కొన్నిసార్లు మీ కిటికీలపై రక్తపు రాతలు, స్క్రాచ్ మార్కులు కనిపిస్తాయి. అంతే.. కానీ వాళ్లు చాలా చాలా ప్రశాంతమైన నైబర్స్." అంటూ మరింత భయపెట్టే ప్రయత్నం చేశాడు ఓ నెటిజన్. పొరుగున శ్మశానవాటికను ఉండటం ప్రశాంతమైన వాటిలో ఒకటి అని మరొక నెటిజన్ చెప్పుకొచ్చాడు. "తాను స్మశాన వాటికలోనే పెరిగాను, ఇది ప్రశాంతమైన పరిసరాల్లో ఒకటి అని నన్ను నమ్మండి." అని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు.


"మియాపూర్‌లో చాలా దెయ్యాలు ఉన్నాయి.. బహుశా మీ ఫ్లాట్‌లో కూడా ఉండవచ్చు. దీనికి పరిష్కారం ఒకటి ఉంది. హైదరాబాద్ జనాలను ఆహ్వానించి.. గట్టిగా పార్టీ ఇవ్వండి. దీంతో.. దెయ్యాలు మమ్మల్ని ద్వేషిస్తాయి." అంటూ మరో హైదరాబాద్‌ నెటిజన్ చెప్పుకొచ్చారు.


Latest News
 

హరీష్ రావుపై ఫిర్యాదు Mon, Oct 21, 2024, 01:57 PM
ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన భాను కృష్ణ Mon, Oct 21, 2024, 01:56 PM
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Mon, Oct 21, 2024, 01:05 PM
పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం Mon, Oct 21, 2024, 01:02 PM
ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 01:01 PM