ప్రజలను మోసం చేయడమేనా కాంగ్రెస్ ప్రజా పాలన

byసూర్య | Mon, Oct 21, 2024, 04:22 PM

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రైతు భరోసా ఇస్తానని గొప్పలు చెప్పారు ఇప్పటివరకు కూడా రైతులకు రైతు భరోసా అందించలేదు, రైతు రుణమాఫీ కూడా రైతులకు పూర్తి చేయలేదు, రైతులు మరణిస్తే ఐదు లక్షల బీమా ఇప్పటివరకు కూడా ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష 16 వేల రూపాయలు తులం బంగారం ఇస్తామని చెప్పి 10 నెలలు గడచిన కానీ ఇప్పటివరకు కూడా ఏ గ్రామంలోనైనా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం లక్ష 16 రూపాయలు ఇచ్చిన దాకాలే లేదు తక్షణమే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు అందించాలని ప్రజల కష్టాలను ప్రజా పాలనలో  చూడనప్పుడు ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందని అన్నారు.
దాదాపు గంటసేపు రోడ్డుమీద బైఠాయించి  ధర్నా నిర్వహించగా పోలీసులు వచ్చి బలవంతంగా నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ దేవేందర్ రావు, మాజీ జెడ్పిటిసి పొన్నాల లక్ష్మణ్, మండల నాయకుడు ఆవుల మహేందర్, కొక్కుల సురేష్, భీమ్ రెడ్డి రాజిరెడ్డి, సందీ శ్రీనివాస్ రెడ్డి,సుతారి కనకయ్య,కోయడ పరశురాములు, అబ్దుల్ రహీం,  తిప్పారపు నాగరాజు, షేక్ అలీ, జాలిగం శంకర్, వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువత విభాగం, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Latest News
 

ఆలయ మాడవీధుల్లో భార్య, కూతురుతో కలిసి కౌశిక్ రెడ్డి రీల్స్ Mon, Oct 21, 2024, 08:41 PM
గ్రూప్ 1 విద్యార్థులు కోరితే తాము కోర్టులో కేసు వేశామన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:26 PM
విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశముందన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:24 PM
బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 08:18 PM
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Mon, Oct 21, 2024, 08:08 PM