తెలంగాణలో భారీ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

byసూర్య | Sun, May 26, 2024, 07:16 PM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. భారీ కుంభకోణానికి శ్రీకారం చుట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పౌరసరఫరాల శాఖలో 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు మొదటి కుంభకోణమని ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకం కోసం 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్లు పేరిట మరో కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ రెండు కలిపితే రూ. 11,00 కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు.


కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏ పని కాదంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు కేటీఆర్. మహిళలకు రూ. 2500 ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి సమయం లేదని మండిపడ్డారు. ఆసరా పెన్షన్లు కనిపించట్లేదన్నారు.. రూ. 2 లక్షల రుణమాఫీ చేసే తెలివి లేదంటూ విమర్శలు గుప్పించారు. సంక్షేమపథకాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం.. గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజునే కమిటీ వేసి.. అదే రోజు గైడ్ లైన్స్ ఇవ్వడం, ఆ రోజే టెండర్లను పిలవడం కూడా జరిగిపోయిదని కేటీఆర్ వివరించారు.


రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు 2,100 ధాన్యం కోనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలిపారని కేటీఆర్ తెలిపారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి.. వారి మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని నిబంధనలు పెట్టి మిల్లర్లను పక్కన పెట్టారన్నారు. గతంలో కేంద్రియ బండార్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేశామని తెలిపారు. ఈ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థను రూల్స్ బ్రేక్ చేసి తొలగించి నాలుగు కంపెనీలతో కుమ్మకు అయ్యారని వెల్లడించారు. ఈ నాలుగు సంస్థలు మనిలాండరీంగ్‌కు పాల్పడుతూ 4 వేల మంది మిల్లర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.


ఈ కుంభకోణంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల దాకా అనేకమంది హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు కేటీఆర్. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు స్పందించలేదని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సీఐ సంస్థ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.


గతంలో అన్ని అనవసరమైన విషయాలపైన అడ్డగోలుగా నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. ఈ రెండు టెండర్ల వ్యవహారంలో సిట్టింగ్ జడ్జి విచారణ చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్రం, ఎఫ్సీఐ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టమని, న్యాయపరంగా కేసులు వేసి దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. తప్పకుండా ఆధారాలతో సహా వీళ్లుదరిని న్యాయస్థానాలతో పాటు ప్రజా కోర్టులోనూ ఎండగడతామన్నారు.


Latest News
 

ఆలయ మాడవీధుల్లో భార్య, కూతురుతో కలిసి కౌశిక్ రెడ్డి రీల్స్ Mon, Oct 21, 2024, 08:41 PM
గ్రూప్ 1 విద్యార్థులు కోరితే తాము కోర్టులో కేసు వేశామన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:26 PM
విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశముందన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:24 PM
బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 08:18 PM
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Mon, Oct 21, 2024, 08:08 PM