కమిన్స్ షాకింగ్ నిర్ణయం

byసూర్య | Sun, May 26, 2024, 11:27 AM

ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరింది. మే 26న, ఆదివారం చెన్నై వేదికగా జరిగే ఫైనల్‌లో ట్రోఫీ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.కేకేఆర్ మూడు టైటిల్ కోసం తహతహలాడుతుండగా.. రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ కావాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉవ్విళ్లూరుతోంది.ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కాబోయే ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు చేయనున్నట్టు తెలుస్తోంది. క్వాలిఫయర్-2లో విఫలమైన ఐడెన్ మార్క్‌రమ్ స్థానంలో కివీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముందట.గత కొన్ని రోజులుగా ఫిలిప్స్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ లిస్టులో ఉన్నప్పటికీ.. ఫ్రాంచైజీ అతడ్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదు. అయితే ఫైనల్స్‌లో ఫిలిప్స్‌ను రంగంలోకి దింపాలని ప్యాట్ కమిన్స్ యోచిస్తున్నట్టు SRH ఫ్రాంచైజీ వర్గాలు చెబుతున్నాయి.క్వాలిఫైయర్-2 అదరగొట్టిన షాబాజ్ అహ్మద్ కూడా ఈసారి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండనున్నాడట. ఈ మార్పులు మినహా SRH జట్టులో మిగతా ప్లేయర్స్ అంతా సేమ్ ఆడనున్నారు. టాస్ బట్టి.. జట్టు ముందుగా బౌలింగ్ చేస్తే.. ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌లో.. బ్యాటింగ్ చేస్తే.. జయదేవ్ ఉనద్కట్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండనున్నారు.అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న కేకేఆర్‌ను ఓడించి కప్పు కొట్టాలని SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పకడ్బందీగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు. కాగా, ఐపీఎల్ ఫైనల్ రోజున వర్షం పడి.. ఆట జరగకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ జరగుతున్న సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా) ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, సమద్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్. ఉనద్కట్ ఇంపాక్ట్ ప్లేయర్ - గ్లెన్ ఫిలిప్స్


Latest News
 

అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్ Fri, Oct 18, 2024, 07:52 PM
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM