byసూర్య | Sun, May 26, 2024, 10:27 AM
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి పై అంతస్తు నుంచి ఓ రోగి దూకి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. జన్నారం కు చెందిన 27 ఏళ్ల సాయి కుమార్ అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం కడుపు నొప్పితో చేరారు. కాగా శనివారం అర్ధరాత్రి దాటాక రిమ్స్ భవనం పైకెక్కి మూడో అంతస్తు నుంచి దూకాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరుగగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది.