నామీద మూడు సార్లు మర్డర్ అటెంప్ట్ చేశారు.. బండి సంజయ్ సంచలన కామెంట్లు

byసూర్య | Sat, May 25, 2024, 10:23 PM

తనను మూడు సార్లు చంపాలని చూశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. నల్గొండలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్.. కేసీఆర్‌కు ముందు పెగ్గు, తినడానికి లెగ్గు ఉంటే సరిపోతుందంటూ సెటైర్లు వేశారు. జూన్ 4వ తేదీన ఇరువైపులా డాక్టర్లను పెట్టుకోవాలని కేసీఆర్‌కు సూచించారు బండి సంజయ్. రైతులు అరిగోస పడే పరిస్థితిని బీఆర్‌ఎస్ పార్టీ తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. అడ్వకేట్ దంపతులను హత్య చేసిన పార్టీ బీఆర్ఎస్ అంటూ ఆరోపించారు.


కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు అని బండి సంజయ్ తెలిపారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యకు కేసీఆర్ కుటుంబమే కారణమని చెప్పుకొచ్చారు. కొవిడ్ వస్తే మోదీ పిలుపు మేరకు ప్రజలకు సేవ చేశామని, 8 వేల మంది బీజేపీ నాయకులను కోల్పోయామని గుర్తు చేశారు. తనపై 105 కేసులు పెట్టారని, 12 సార్లు జైలుకు వెళ్లి వచ్చానని, 3 సార్లు తనని చంపాలని చూశారంటూ సంచలన కామెంట్లు చేశారు. ఐదేళ్లు తన కుటుంబానికి దూరం అయ్యానని బండి సంజయ్ ఆరోపించారు.


పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని, ఆఖరికి బాత్రూం కడగటానికి స్కావెంజర్లు కూడా లేరంటూ బండి సంజయ్ కీలక ఆరోపణలు చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించే పరిస్థితి కూడా లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి అధికారం కోసం పోటీ చేయడం లేదని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు పోటీ చేస్తున్నట్టు బండి సంజయ్‌ తెలిపారు. 15 నిమిషాల్లో హిందువులను చంపుతాం అన్న ఒవైసీతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని.. వారికి ఓటు వేయొద్దని తెలిపారు. ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM