తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, అక్కడ మాత్రం భానుడి భగభగలు

byసూర్య | Sat, May 25, 2024, 09:43 PM

తెంగాణలో గత కొన్నిరోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంది. ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. గత 15 రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక చోట వానలు పడుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు రెయిన్ అలర్డ్ జారీ చేసారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు.


నేడు ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవొచ్చని చెప్పారు. ఆ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు.


ఎల్బీనగర్‌లో వర్ష బీభత్సం.. నీట మునిగిన విజయవాడ హైవే


శుక్రవారం (మే 24) రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించారు. కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని.. నేడు కూడా తీవ్ర ఎండలు ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM